Wikipedia

Search results

Monday, April 7, 2025

ఉప్పల్ నుండి నారపల్లి వరకు ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి

ఉప్పల్ నుండి నరపల్లి వరకు ఫ్లైఓవర్ పనులు నిలిచిపోయిన పరిస్థితి: ఉప్పల్ నుంచి నరపల్లి వరకు నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనులు సంవత్సరాలుగా నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులు పూర్తవకుండా వదిలేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతి రోజూ వేలాది వాహనాలు ప్రయాణించే ఈ ప్రధాన మార్గంలో ఫ్లైఓవర్ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. వాహనదారులు చిన్న చిన్న గుంతలు,ఉండటంతో రహదారి పొడవునా తీవ్రంగా ట్రాఫిక్ జామ్‌అవుతుంది. మట్టి, ధూళితో నానా అవస్థలు పడుతున్నారు. దారిపొడవునా గుంతలు, అబద్దంగా మిగిలిన పనులు, ధూళి వలన పుట్టే ఆరోగ్య సమస్యలు – ప్రత్యేకించి పిల్లలు, వృద్ధులు బాధపడుతున్నారు ప్రజల వినతి:ప్రజలు అధికారులు, ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం:ఎంత కాలంగా పనులు ఇలా నిలిచిపోయాయో. కనీసం ఇప్పుడు అయినా వేగంగా పూర్తిచేయాలని కోరుకుంటున్నాం. లేకపోతే రోడ్డుపై నిత్యం ప్రయాణించడం ఓ శిక్షలా మారింది. ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నా, ఇంకా అధికారుల నుంచి స్పష్టత లేదు. ఈ నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తి అవుతాయో అర్ధం కావడం లేదు. సిటీ అభివృద్ధికి ఫ్లైఓవర్‌లు అవసరమే. కానీ మధ్యలో ఆగిపోయిన పనులు – అభివృద్ధికి కాదు, ప్రజలకు భారంగా మారుతున్నాయి.

నేటి తెలుగు వార్తలు

బతుకమ్మ 2025 వేడుకలు 🌸

  సెప్టెంబర్ 21 నుండి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగను ఘనంగా జరపడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. హుస్సేన్‌సాగర్‌లో...

Popular Content